ఆధార్ వివరాలు బయటపెట్టిన జర్నలిస్టుపై కేసు వేయడంపై ఎడ్వర్డ్ స్నోడెన్ ట్వీట్
- అవార్డు ఇవ్వాల్సింది పోయి విచారణ చేపట్టడం సబబుకాదని వ్యాఖ్య
- ప్రజలకు న్యాయం చేకూర్చే ప్రభుత్వం ఇలా చేయదన్న స్నోడెన్
- తప్పు చేసిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి
ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చర్యలు తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు. బిలియన్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను నమోదు చేసే పాలసీలను మార్పు చేయడమో.. లేక దుర్వినియోగానికి పాల్పడి తప్పు చేసిన వారిని శిక్షించడమో చేయాలని స్నోడెన్ సూచించారు. మరోవైపు హ్యాక్‌కి సంబంధించి వార్తలు వచ్చినపుడు కూడా స్నోడెన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ, వ్యక్తిగత వివరాల హ్యాక్‌ని అరికట్టలేరని స్నోడెన్ గత ట్వీట్‌లో పేర్కొన్నారు.