'సత్య' సినిమాలో 'కల్లు మామ' పాటతో రైటర్ గా మారాను: కోన వెంకట్
- 'సత్య' సినిమా కోసం పాట రాశాను
- వర్మకి ఆ పాట రాసిన తీరు నచ్చింది
- మాటలు కూడా నన్నే రాయమన్నారు
- రైటర్ అవుతానని అనుకోలేదు
" నేను ఘోస్ట్ రైటర్ గా ఎవరి దగ్గర పనిచేయలేదు .. అంత అవసరమూ రాలేదు. రామ్ గోపాల్ వర్మతో వున్న పరిచయం కారణంగా 'సత్య' సినిమా కోసం 'మామ .. కల్లు మామా' అనే పాట రాశాను. ఆ సినిమాలో గ్యాంగ్ స్టర్స్ పాడుకునే పాట అది. అది రాసిన తరువాత .. 'నువ్ డైలాగ్స్ ఎందుకు రాయకూడదు? ఈ సినిమాకి రాసేయి' అన్నారు. అప్పటి వరకూ రైటర్ అవుదామనే ఆలోచన కూడా నాకు లేదు .. కానీ వర్మ ఇచ్చిన ప్రోత్సాహంతో రాసేశాను. అలా రైటర్ గా నా కెరియర్ 'సత్య' సినిమాతో మొదలైంది" అంటూ చెప్పుకొచ్చారు