కోర్టుకు డుమ్మా కొట్టిన యాంకర్ ప్రదీప్!
- అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా
- రేపు హాజరవుతానని సమాచారం ఇచ్చిన ప్రదీప్
- రాకుంటే వారెంట్ జారీ అవుతుందని హెచ్చరించిన పోలీసులు
కాగా, డిసెంబర్ 31 తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రదీప్, వారం రోజుల తరువాత నిన్న కౌన్సెలింగ్ కు తన తండ్రితో కలసి హాజరైన సంగతి తెలిసిందే. ఆపై నేడు కోర్టుకు ఆయన హాజరు కావాల్సివుంది. ప్రదీప్ కు పడే శిక్షపై ఆసక్తితో పెద్ద ఎత్తున మీడియా నాంపల్లి కోర్టుకు చేరుకుంది. ఇక రేపు కోర్టుకు రాకుంటే, వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయాల్సి వుంటుందని పోలీసు వర్గాలు ఆయన్ను హెచ్చరించినట్టు తెలుస్తోంది.