కుర్చీ కథ చెబుతూ... 'అజ్ఞాతవాసి' ట్రైలర్ వచ్చేసింది!
- విడుదలైన అజ్ఞాతవాసి ట్రయిలర్
- 1.35 నిమిషాల నిడివి
- ఆకట్టుకుంటున్న పవన్ డైలాగ్స్
ఈ ట్రయిలర్ తాజాగా విడుదల కాగా, నెట్టింట దూసుకెళుతోంది. ఒక నిమిషం 35 సెకన్ల నిడివి వున్న ఈ ట్రయిలర్ లో "వయొలెన్స్ ఈజ్ నాట్ ఏన్ ఆప్షన్" అన్న తొలి డైలాగుతో పాటు, "కౌగిలించుకోలేదండీ... జస్ట్ పట్టుకున్నామంతే" అన్న పవన్ మరో డైలాగ్, ఆయన ఇంట్లోనే సైకిల్ తొక్కుతున్న దృశ్యాలు, ఓ ఫైట్ బిట్, కార్ చేజింగ్ సీన్ ఉన్నాయి.
"మళ్లీ సైకిలెక్కుతాడా వర్మా?" అని మురళీ వర్మ ప్రశ్నించగా, "వాడు ఏదెక్కినా పర్లేదుగానీ మనల్ని ఎక్కకుంటే చాలు" అన్న రావు రమేష్ డైలాగ్ "వీడి చర్యలు ఊహాతీతం వర్మా... దట్స్ బ్యూటీ" అన్న డైలాగులు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ ట్రయిలర్ ను మీరూ చూడండి.