ట్రాఫిక్ పోలీసుల కాంటాక్టులోకి వచ్చిన యాంకర్ ప్రదీప్!
- వారం క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన మాచిరాజు ప్రదీప్
- అప్పటి నుంచి పరారీలో ఉన్న యాంకర్
- సోమవారం నాడు కౌన్సెలింగ్ కు వస్తానని వెల్లడి
కొత్త సంవత్సరం సందర్భంగా పూటుగా మందు కొట్టి పోలీసుల తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆపై కౌన్సెలింగ్ కు రాకపోవడంతో ఆయన కార్యాలయం, ఇంటికి వెళ్లిన పోలీసులు ఉత్త చేతులతో వచ్చారు. ఆపై ప్రదీప్ పరారీలో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదికను ఇచ్చారు. కాగా, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, కౌన్సెలింగ్ కు భార్య లేదా తల్లితో పాటు హాజరు కావాల్సి వుంటుంది. ప్రదీప్ కు భార్య లేదు కాబట్టి, తల్లిని తీసుకు రావాలని పోలీసులు చెబుతున్నారు.