పవన్ మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దు.. ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టొద్దు, తీవ్రవాదులను చేయొద్దు!: కోన వెంకట్ హెచ్చరిక
- మహేశ్ కత్తి తీరుపై మీడియా ముందుకు కోన వెంకట్
- కత్తి మహేశ్ చాలా తెలివైనవారు.. ఎంతో పరిజ్ఞానం ఉంది
- ఆ తెలివిని మంచి మార్గంలో పెట్టాలి
- అలా చేస్తే విమర్శించేవారే మెచ్చుకుంటారు
కత్తి మహేశ్ చాలా తెలివైనవారని, ఎంతో పరిజ్ఞానం ఉందని, ఆ తెలివిని మంచి మార్గంలో పెట్టాలని సూచించారు. అలా చేస్తే ఇప్పుడు మహేశ్ కత్తిని ఎవరైతే విమర్శిస్తున్నారో వారే మెచ్చుకుంటారని అన్నారు. కేవలం మహేశ్ కత్తి మాత్రమే కాదని, ఫ్యాన్సును రెచ్చగొడుతూ స్టేట్ మెంట్లు ఇస్తోన్న వారు ఎవరైనా ఇక ఇటువంటివి ఆపాలని కోన వెంకట్ సూచించారు. అందరం ఒక ఫ్యామిలీలా ఉండాలని, కలసిమెలసి ఉండాలని అంతేగానీ, ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ఎవ్వరినీ బాధ పెట్టవద్దని కోరారు.