చంద్రబాబుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
- జన్మభూమి కార్యక్రమంలో వివాదం
- వైయస్ ను పొగిడిన అవినాశ్
- అడ్డుకున్న టీడీపీ నేతలు
ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలో వందలాది మంది టీడీపీ నేతలు వేదికపై ఎలా ఉంటారని ప్రశ్నించారు. వేదికపై పార్లమెంటు సభ్యుడినే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. లేఖతో పాటు దినపత్రికలలో ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్ లను కూడా ఆయన జత చేశారు.