నాన్న చనిపోయినప్పుడు కూడా నా దగ్గర పైసా లేదు: 'జబర్దస్త్' శాంతిస్వరూప్
- నాన్నను బతికించుకోలేకపోయాను
- చనిపోయిన తరువాత ఏమీ చేయలేకపోయాను
- అది తలచుకుంటే కలిగే బాధ అంతా ఇంతా కాదు
"మా నాన్న చనిపోయిన తరువాత నేను ఇంటికి వెళ్లాను. నేను బాగా సంపాదించేశానని ఊళ్లో వాళ్లంతా అనుకున్నారు. అన్నదమ్ములంతా కలిసి తలా రెండు వేలు వేసుకుని కార్యక్రమాన్ని జరిపించాలన్నారు. అప్పుడు నా దగ్గర 500 కూడా లేవు .. నాన్నను బతికించుకోలేకపోయాను .. చనిపోయిన తరువాత కూడా ఏమీ చేయలేకపోతున్నానే అనిపించింది. హైదరాబాద్ లో తెలిసినతనికి ఫోన్ చేసి .. మా ఊళ్లో తెలిసిన వారి ఎకౌంట్ నెంబర్ చెప్పి, 2000 వేయమని కోరాను. ఆయన చేసిన సాయంతో మాట దక్కింది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.