ఈవెంట్స్ కి వెళితే కామెంట్స్ చేస్తూనే వుంటారు .. పట్టించుకోను: 'జబర్దస్త్' శాంతిస్వరూప్
- స్టేజ్ పై కనిపించగానే జనం గోల చేస్తుంటారు
- కామెంట్స్ కి సరదాగానే వుంటుంది
- హద్దు మీరితే మాత్రం కోపం వస్తుంది
"ఏయ్ రైలు కింద రూపాయి బిళ్లా .. పిండేసిన టూత్ పేస్ట్ .. టేకుచెక్క .. అంటూ అరుస్తూనే వుంటారు. అప్పుడు నేను పెద్దగా ఫీలవ్వను .. వాళ్లు అంతగా 'జబర్దస్త్'కి కనెక్ట్ అయ్యారనుకుంటాను. నేను పోషిస్తోన్న పాత్రలను వాళ్లు అంతగా రిసీవ్ చేసుకుంటున్నారని అనుకుంటాను. 'ఐ లవ్ యూ రా డాళింగ్' అంటూ నవ్వుతూ పలకరిస్తాను. ఎప్పుడైనా ఎవరైనా మరీ హద్దు దాటిపోతే కోపం వస్తూ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.