రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితుల్లో 'జబర్దస్త్'లో ఛాన్స్ వచ్చింది: శాంతి స్వరూప్
- 'జబర్దస్త్'కి ముందు చాలా కష్టాల్లో వున్నాను
- చమ్మక్ చంద్ర తన టీమ్ లో ఛాన్స్ ఇచ్చాడు
- ఈ షో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది
"ఒక రోజు తింటే ఒక రోజు తినని సందర్భాలు వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో .. 'జబర్దస్త్'లో లేడీ గెటప్ వేసే ఆర్టిస్ట్ కావాలని రచ్చరవితో చమ్మక్ చంద్ర చెప్పాడట. అప్పటికే నాతో వున్న పరిచయం కారణంగా, రచ్చరవి నన్ను తీసుకెళ్లి చమ్మక్ చంద్రకి పరిచయం చేశాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు .. 'జబర్దస్త్'తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రూమ్ రెంట్ కి తీసుకుని ఉండగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.