'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్!
- సెన్సార్ పూర్తి చేసుకున్న 'జై సింహా'
- ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- చిరంతన్ భట్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
టీజర్ చూసినవాళ్లు బాలకృష్ణ మరింత హ్యాండ్సమ్ గా ఉన్నాడనీ .. నయనతార మరింత గ్లామర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అందుకు ఫుల్ ఖుషీ అవుతోన్న ఈ సినిమా టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. బలమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చెబుతుంటే, చిరంతన్ భట్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్మాత అంటున్నారు.