ఆసక్తిని రేకెత్తిస్తూ 'అ!' సినిమా నుంచి టీజర్ వచ్చేసింది
- నాని నిర్మాతగా తెరకెక్కుతోన్న 'అ!' మూవీ
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
- ప్రధాన పాత్రల్లో కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్
ప్రధాన పాత్రధారులైన కాజల్ .. రెజీనా .. నిత్యా మీనన్.. మురళీశర్మ .. ప్రియదర్శినిలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. అంతా కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సస్పెన్స్ కి .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ అందుకు సంబంధించిన దృశ్యాలతో ఈ టీజర్ ను వదిలారు. ఈ సినిమాకి కథే హీరో అనే విషయాన్ని కూడా వాయిస్ ఓవర్ ద్వారానే చెప్పించేశారు. మొత్తం మీద కథ నేపథ్యం ఏమిటి? అనే విషయాన్ని రివీల్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ ను కట్ చేశారు.