సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- అమెరికా ట్రిప్ కేన్సిల్ చేసుకున్న హన్సిక
- రామ్ చరణ్ సరసన కైరా అద్వాని
- న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకున్న బన్నీ
* రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వాని కథానాయికగా నటించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందే చిత్రం కోసం కైరా అద్వానీని బుక్ చేసినట్టు తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తోంది.
* 'నా పేరే సూర్య' చిత్రం షూటింగ్ నుంచి హీరో అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. నూతన సంవత్సర ఆగమనాన్ని కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవడానికి నాలుగు రోజుల సెలవు తీసుకున్నాడు. తిరిగి జనవరి నాలుగు నుంచి షూటింగులో పాల్గొంటాడు.