ఆసక్తిని రేపుతోన్న 'గులేబకావళి' ట్రైలర్ .. దుమ్మురేపేస్తోన్న ప్రభుదేవా
- ప్రభుదేవా హీరోగా 'గులేబకావళి'
- కథానాయికగా హన్సిక
- తమిళంతో పాటు తెలుగులోను విడుదల
కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన ఈ సినిమా ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. పురాతనమైన దేవతా విగ్రహాల అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ కొనసాగనున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. డాన్స్ పరంగా .. ఫైట్స్ పరంగా ప్రభుదేవా మరోసారి రెచ్చిపోయినట్టుగా కనబడుతోంది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా హన్సిక కనిపించనుంది.