ఆ రూమ్ అంటే త్రివిక్రమ్ కి సెంటిమెంట్ .. అందుకే ఇప్పటికీ రెంట్ కడుతున్నాడు!
- ఆ అద్దె ఇంట్లోనే త్రివిక్రమ్ కథలు రాశాడు
- మాటల రచయితగా మార్కులు కొట్టేశాడు
- సక్సెస్ లు సాధిస్తూ అగ్రస్థానానికి చేరుకున్నాడు
పంజగుట్టలోని సాయిబాబా ఆలయం సమీపంలోని ఒక ఇంట్లో, సునీల్ .. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తో కలిసి ఆయన అప్పట్లో ఇక్కడ అద్దెకి ఉండేవాడు. ఇక్కడే ఆయన ఎన్నో కథలను రాశాడు .. మాటల రచయితగా మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం అగ్రదర్శకుల జాబితాలో కనిపించే త్రివిక్రమ్, విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయినా గతంలో తాను అద్దెకి వున్న రూమ్ కి ఇప్పటికీ 5 వేలకి పైగానే రెంట్ చెల్లిస్తూ తనకిందే దానిని ఉంచాడట. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి సరదాగా కాసేపు వుండటం, కొత్త కథలు .. మాటలు అక్కడ మొదలుపెట్టడం చేస్తుంటాడు .. ఆ ఇల్లంటే ఆయనకి అంత సెంటిమెంట్ మరి.