అందుకే 'అజ్ఞాతవాసి'లో సునీల్ చేయలేదట!
- కమెడియన్ గా రావాలనుకుంటోన్న సునీల్
- 'అజ్ఞాతవాసి'లో ఛాన్స్ ఇవ్వాలనుకున్న త్రివిక్రమ్
- సంతృప్తికరంగా రాకపోవడం వలన పక్కన పెట్టేసిన ట్రాక్
అలా కమెడియన్ గా 'అజ్ఞాతవాసి' ద్వారా సునీల్ ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి త్రివిక్రమ్ గట్టిగానే ప్రయత్నించాడట. సునీల్ కోసం ఒక ట్రాక్ ను సిద్ధం చేశాడు. కథా చర్చల్లో సునీల్ కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. అయితే ఆ ట్రాక్ సంతృప్తికరంగా రాకపోవడంతో పక్కన పెట్టేస్తున్నట్టు త్రివిక్రమ్ చెప్పాడట. 'నెక్స్ట్ ప్రాజెక్టులో చేస్తానులే' అంటూ సునీల్ తన సినిమాలపై ఫోకస్ పెట్టాడని అంటున్నారు. లేదంటే కమెడియన్ గా 'అజ్ఞాతవాసి' సినిమా నుంచే సునీల్ ఆడియన్స్ ముందుకు వచ్చేవాడిని చెప్పుకుంటున్నారు.