ఒక్క ఫొటోతో లక్షాధికారి అయిన బ్రిటన్ మహిళ!
- రాయల్ కుటుంబాన్ని ఒకే ఫొటోలో బంధించిన కారెన్ ముర్దోచ్
- వైరల్ అయిన ఫొటో
- కొనడానికి ముందుకు వచ్చిన వార్తా సంస్థలు
క్రిస్‌మస్ సందర్భంగా రాజకుటుంబం నిర్వహించిన పార్టీని చూడటానికి అందరితో పాటు ఆమె కూడా వెళ్లింది. అక్కడ వారి నలుగురిని ఆమె అనుకోకుండా ఫొటో తీసింది. తర్వాత ఆ ఫొటోను `ఫ్యాబ్ ఫోర్` అని ట్విట్టర్‌లో షేర్ చేసింది. అంతే... ఒక్కరోజులో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోను తమ పత్రికల్లో ప్రధానంగా ప్రచురించుకునేందుకు బ్రిటన్‌కి చెందిన ప్రధాన వార్తాపత్రికలన్నీ కారెన్‌ని సంప్రదించాయి. ఫొటో ఒరిజినల్ హక్కులను కొనడానికి ముందుకొచ్చాయి. దీంతో ఆ ఫొటో ఖరీదు నిర్ణయించడానికి కరెన్ ఓ ఏజెంట్‌ను కూడా పెట్టుకోవాల్సి వచ్చింది.
మొత్తానికి ఈ ఫొటో ద్వారా తన కూతురు చదువుకి కావాల్సిన డబ్బు సమకూరితే చాలని కారెన్ అనుకుంటోంది. ఏజెంట్ లెక్కల ప్రకారం, ఈ ఫొటో 27000 పౌండ్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.