ఆది చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండకు వెళ్లిందా?
- సరైన హిట్ కోసం ఆది వెయిటింగ్
- తమిళంలో ఛాన్స్ ఇస్తానన్న జ్ఞానవేల్ రాజా
- చివరికి ఆదికి మిగిలింది నిరాశే
ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆయనతో ఒక సినిమా చేస్తానని జ్ఞానవేల్ రాజా మాట ఇచ్చాడట. జ్ఞానవేల్ రాజా .. స్టూడియో గ్రీన్ సంస్థకి గల పేరు గురించి తెలిసిన ఆది సాయికుమార్, అక్కడి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆ సంస్థ విజయ్ దేవరకొండను తీసుకోవడంతో, ఆది సాయికుమార్ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. మొత్తానికి ఆది సాయికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్టును విజయ్ దేవరకొండ తన్నుకు పోయాడన్న మాట.