విడుదలకు ముందే మరో రికార్డు కొడుతున్న 'అజ్ఞాతవాసి'!
- అమెరికాలోని ప్రతిష్ఠాత్మక థియేటర్లో ప్రదర్శన
- ఇక్కడ ప్రదర్శితం కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డు
- ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న టీజర్, ఆడియో
ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. 2018 జనవరి 9న ఈ చిత్రాన్ని సిటీ వాక్ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు, టీజర్ మంచి టాక్ అందుకున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.