'ఝాన్సీ రాణి' తరహా పాత్రలు చేయాలనుంది: సురభి
- సురభికి యూత్ లో క్రేజ్
- చేతిలో రెండు సినిమాలు
- 28న 'ఒక్క క్షణం' విడుదల
తాజా ఇంటర్వ్యూలో సురభి మాట్లాడుతూ ఉండగా, 'డ్రీమ్ రోల్' ఏమిటనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అప్పుడామె స్పందిస్తూ .. "యుద్ధం నేపథ్యంతో కూడిన చారిత్రక చిత్రంలో నటించాలని వుంది. 'ఝాన్సీ రాణి' తరహా పాత్రలు చేయాలని ఉంది" అని చెప్పింది సురభి. 'ఝాన్సీ రాణి' మాదిరిగా కత్తి చేతబట్టి యుద్ధాలు చేసే పాత్రలో నటించాలని వుంది" అంటూ చెప్పుకొచ్చింది. మరి, ఈ సుకుమారిని వెతుక్కుంటూ ఆ తరహా పాత్రలు వస్తాయేమో చూడాలి.