ఆ అబ్బాయి నాతో సెల్ఫీ తీసుకుని 'మీరు డా.శైలజ కదా?' అన్నాడు: జయసుధ
- పుదుచ్చేరిలో ఈ అనుభవం ఎదురైంది
- ఆ అబ్బాయి ఆంధ్రకు చెందిన వ్యక్తి కాదు
- 'ఎవడు' సినిమాలో నా పాత్ర పేరు డా.శైలజ
- అందుకే అలా అడిగాడు
పుదుచ్చేరిలో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తాను కారు ఎక్కుతుండగా, ఒక అభిమాని వచ్చి సెల్ఫీ తీసుకుంటానని అడిగాడని జయసుధ అన్నారు. ఆ అబ్బాయి ఆంధ్రకు చెందిన వ్యక్తి కాదని చెప్పారు. సెల్ఫీ తీసుకున్న తరువాత 'మీరు డా.శైలజ కదా?' అని అడిగాడని తెలిపారు. తాను నటించిన 'ఎవడు' సినిమా హిందీలో డబ్ అయిందని, ఆ సినిమాలో తన పేరు డా.శైలజ అని, అందుకే ఆ అబ్బాయి తనను 'డా.శైలజ' అని అన్నాడని చెప్పారు.