ఒకే సంవత్సరంలో ఆరు సక్సెస్లు సాధించడం దిల్ రాజుకే చెల్లింది!: అల్లు అర్జున్
- హైదరాబాద్లో దిల్ రాజు సక్సెస్ జర్నీ ప్రోగ్రాం
- హాజరైన సినీ ప్రముఖులు
- శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ సినిమాలు విజయవంతం
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. శత మానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ సినిమాలు మంచి విజయం సాధించాయని, ఆయా సినిమాల కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు. దిల్ రాజుకి ఈ సక్సెస్ ఊరికే రాలేదని అన్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సినిమాలు ప్రారంభం అయ్యేటప్పుడు శ్రీ అనిత సమర్పించు అని కనపడుతుందని అన్నారు. ఆమె మృతితో దిల్ రాజు ఎంతో బాధను కూడా అనుభవించారని అన్నారు. దిల్రాజు ఎంతో కష్టపడతారని చెప్పారు.