రవితేజ ఆగడం లేదు .. జనవరిలోనే వచ్చేస్తున్నాడు
- రవితేజ తదుపరి చిత్రంగా 'టచ్ చేసి చూడు'
- ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్
- కథానాయికలుగా రాశి ఖన్నా .. శీరత్ కపూర్
ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి .. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టిన రోజు .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా .. అంటే జనవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. నల్లమలుపు బుజ్జి .. వల్లభనేని వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ సరసన రాశి ఖన్నా .. శీరత్ కపూర్ లు నటించారు.