సందీప్ కిషన్ తమిళ హిట్ .. తెలుగులోకి!
- తమిళంలో హిట్ కొట్టిన 'మాయావన్'
- 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగులోకి
- కథానాయికగా లావణ్య త్రిపాఠి
- ఈ నెల 29న విడుదల
సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమా అక్కడ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాను 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా, ఉత్కంఠభరితమైన కథా కథనాలతో కొనసాగనుందట. తెలుగులోనూ ఈ సినిమా సందీప్ కిషన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.