సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- శ్రుతి హాసన్ ఎవరు చెప్పినా వింటుందట!
- బ్యాడ్ బాయ్ పాత్రలో మాధవన్!
- నాగార్జునకు నాని కామెడీ ఇష్టమట
- రెగ్యులర్ షూటింగులో గోపీచంద్
* ప్రముఖ నటుడు మాధవన్ తాజాగా తెలుగులో 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాధవన్ నెగటివ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడని, ఈ పాత్ర చాలా వైవిధ్యంతో సాగుతుందని సమాచారం.
* అక్కినేని నాగార్జున, నాని కలసి ఓ మల్టీ స్టారర్ చేయనున్న సంగతి విదితమే. దీని గురించి నాగ్ తాజాగా చెబుతూ, దర్శకుడు శ్రీరాం ఆదిత్య చెప్పిన కథ చాలా బాగుందని, అందుకే డెవలప్ చేయమని వెంటనే చెప్పేశానని అన్నారు. తనకు నాని కామెడీ టైమింగ్ చాలా ఇష్టమని, అతనితో చేస్తున్నందుకు హ్యాపీగా వుందని చెప్పారు.
* ఇటీవల 'ఆక్సిజన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది.