ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన హీరోయిన్ అమలాపాల్!
- ఆమె కారుకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో కేరళ హైకోర్టులో కేసు
- తప్పుడు వివరాలు ఇచ్చిందని ఆరోపణలు
- తాను పుదుచ్చేరిలో నివసిస్తున్నానని తప్పుగా పేర్కొన్న హీరోయిన్
తనది కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అని పేర్కొంటూ అడ్రెస్ వివరాలు ఫోర్జరీ చేసిందని కేరళ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ కేసు వేశారు. అమలాపాల్ చేసిన ఈ పనితో కేరళ రాష్ట్రానికి నష్టం వచ్చిందని అన్నారు. అయితే, తాను గతంలో పుదుచ్చేరిలోనే నివసించేదాన్నని అమలాపాల్ చెప్పింది. తనకు అక్కడ సొంత ఇల్లు ఉందని ఇప్పుడు దానిని అద్దెకు ఇచ్చానని పేర్కొంది.