హద్దులు దాటే గ్లామర్ పాత్రలు చేయలేను: మంజిమా మోహన్
- పద్ధతిగా కనిపించే పాత్రలే చేస్తాను
- అవకాశాలు తగ్గినా ఫరవాలేదు
- నేను చేయతగిన పాత్రలు నాకు వస్తాయి
తాజాగా ఆమె మాట్లాడుతూ .. " గ్లామర్ గా కనిపించడం అంటే నేను అనుకునే కోణం వేరు .. ఇతరులు ఆలోచించే విధానం వేరు. కథానాయికలు అందంగా కనిపించవలసిందే .. అయితే అది హద్దులు దాటనంతవరకే అనేది నా ఉద్దేశం. ఎక్స్పోజింగ్ కి గ్లామర్ అనే పేరు తగిలించేస్తే చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. ఈ కారణంగా అవకాశాలు తగ్గుతాయనే సంగతి నాకు తెలుసు. కానీ ఫలానా పాత్ర మంజిమా చేస్తేనే బాగుంటుందనుకునే వాళ్లు వున్నారు. అందువలన నేను చేయదగిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చింది.