Sunny Leone: చారిత్రక చిత్రం కోసం సన్నీ లియోన్ పారితోషికం రూ. 3.25 కోట్లు!
- వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్
- నాలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రం
- యువరాణి పాత్రలో సన్నీ
బాలీవుడ్ అందాల తార సన్నీ లియోన్ మొదటిసారి ఓ చారిత్రక కథాంశంతో నడిచే సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె రూ. 3.25 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆమె అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాత స్టీఫెన్ ఒప్పుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి తమిళ దర్శకుడు వడి వుడయన్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. ఇప్పటి వరకు దక్షిణాదిలో అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలకే పరిమితమైన సన్నీ, పూర్తిస్థాయి కథలో కనిపిస్తే చూడాలని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.