'భారతీయుడు 2' నిర్మించాలనే ఆలోచనను విరమించుకున్నాను: దిల్ రాజు
- వచ్చే ఏడాది నిర్మాతగా మూడు సినిమాలు
- వీటిలో ఒకటి 'మల్టీ స్టారర్'
- ఇద్దరు నూతన దర్శకులతో రెండు కొత్త ప్రాజెక్టులు
ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ .. పెట్టుబడి వెనక్కి రావడం లేదని అన్నారు. వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి - మహేశ్ సినిమా.. శర్వానంద్ - నితిన్ లతో 'దాగుడు మూతలు' .. నితిన్ తో 'శ్రీనివాస కల్యాణం' చేయనున్నట్టుగా చెప్పారు. వచ్చే ఏడాది ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేయనున్నానని అన్నారు. ఇక శంకర్ తో 'భారతీయుడు 2' సినిమాను నిర్మించాలనుకున్నాననీ, అయితే సన్నిహితులు వారించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పుకొచ్చారు.