న్యూ ఇయర్ వేడుకలకు సన్నీ రావడానికి వీల్లేదు... కర్ణాటక యువసేన
- ఆమె వస్తే సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు
- కర్ణాటక సంస్కృతి రక్షణకోసం ఆమెను అడ్డుకుంటాం
- ఓ ఈవెంట్ కోసం హాజరుకాబోతున్న బాలీవుడ్ తార
ఈ విషయమై కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాలలో ఇప్పటికే భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. యువసేన సభ్యులు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చడం జరిగింది. అయితే ఈవెంట్ నిర్వాహకులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముంబైలో ఎన్నో మంచి ఆఫర్లను తిరస్కరించి సన్నీ ఈ షోకు ఓకే చెప్పారని, ఈ విధంగా దక్షిణాది నగరాల మీద ఆమె ప్రేమ చూపిస్తుంటే ఇలా నిరసనలు చేయడం సబబు కాదని అన్నారు.