'ఆచారి అమెరికా యాత్ర' ఎక్కడివరకూ వచ్చిందంటే ..!
- విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
- ఈ నెల 21 నుంచి హైదరాబాద్ లో చివరి షెడ్యూల్
- జనవరి 26న ప్రేక్షకుల ముందుకు
ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 'అదుర్స్' సినిమాలో బ్రహ్మానందం చేసిన పాత్రను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. ఆ తరహా పాత్రలోనే ఆయన సందడి చేయనున్నాడని అంటున్నారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విష్ణుకు హిట్ ఇస్తుందేమో చూడాలి.