అమితాబ్ అంటే ఇష్టం .. ఆయనే స్వయంగా వచ్చి పిలిచారు!: శుభలేఖ సుధాకర్
- అమితాబ్ బస చేసిన హోటల్ కి వెళ్లాను
- ఆయనకి ముందుగా చెప్పకుండా కలవడం కరెక్ట్ కాదనిపించింది
- బయటే పచార్లు చేస్తున్నాను
- అప్పుడు ఆయన స్వయంగా వచ్చి లోపలికి రమ్మన్నారు
గోపాల్ రెడ్డిగారితో 'సార్ .. మీరు లోపలికి వెళ్లండి .. చెప్పండి .. ఓ అయిదు నిమిషాలు ఇక్కడే వెయిట్ చేస్తాను .. ఈ లోగా మీరు వచ్చి పిలిస్తే వస్తాను .. లేదంటే మీరు ఏమీ అనుకోకండి .. వెళ్లిపోతాను' అన్నాను. గోపాల్ రెడ్డి గారు నచ్చజెప్పినా నేను వినిపించుకోలేదు. ఆయన లోపలికి వెళ్లడంతో నేను బయట పచార్లు చేస్తున్నాను .. అంతలో డోర్ ఓపెన్ అయింది .. ఎదురుగా అమితాబ్ గారు నిలబడి వున్నారు.
"సుధాకర్ .. మీరు గోపాల్ రెడ్డికి ఫ్రెండ్ అయితే నాకూ ఫ్రెండే .. ప్లీజ్ కమీన్" అన్నారు. అంతటి సూపర్ స్టార్ అలా స్వయంగా వచ్చి పిలవడం నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది .. ఆనందాన్ని కలిగించింది. ఈ సంఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చారు.