అలనాటి బాలీవుడ్ తార మీనా కుమారి పాత్రలో సన్నీలియోన్!
- కరణ్ రాజ్దాన్ దర్శకత్వంలో చిత్రం
- మొదట విద్యాబాలన్‌ను తీసుకున్న సినిమా బృందం
- విద్యాబాలన్ తప్పుకోవడంతో సన్నీకి ఛాన్స్
- మద్యానికి బానిసై మృతి చెందిన విషయం చూపిస్తాం-దర్శకుడు
ఈ సినిమా కథ విన్న వెంటనే సన్నీలియోన్ ఓకే చెప్పేసిందని ఆ సినిమా బృందం తెలిపింది. ఈ సినిమా దర్శకుడు కరణ్ రాజ్దాన్ తాజాగా మాట్లాడుతూ... సన్నీ లియోన్‌కు అర్థమయ్యేలా తాను స్క్రిప్ట్ వివరించానని అన్నారు. మొదట ఈ పాత్రకు సన్నీని తీసుకోవాలని అనుకోలేదని, కథ చెప్పగానే సన్నీలియోన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపించిందని తెలిపారు. అలనాటి నటి మీనాకుమారి మద్యానికి బానిసై మృతి చెందిన విషయాన్ని తాము చూపిస్తామని చెప్పారు.