థాయ్ ల్యాండ్ వెళుతోన్న 'రాజుగాడు'
- టాకీ పార్టు పూర్తి చేసుకున్న 'రాజుగాడు'
- రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్
- పెండింగ్ లో రెండు పాటలు
- త్వరలో విదేశాలకి
ఈ పాటలను థాయ్ ల్యాండ్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీన అక్కడికి చేరుకోనున్నట్టు దర్శకురాలు సంజనా రెడ్డి చెప్పారు. మొదటిసారిగా మెగా ఫోన్ పట్టిన తనకి యూనిట్ నుంచి .. సీనియర్ ఆర్టిస్టుల నుంచి మంచి సహకారం లభిస్తోందని ఆమె అన్నారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, తనకి ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.