ఆకట్టుకుంటున్న సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది' ప్రీ లుక్
- విడుదల చేసిన ఆనందీ ఇందిరా ప్రొడక్షన్స్
- ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న మహేశ్‌బాబు మేనకోడలు జాన్వి
- రేపు ప్రీ లుక్ టీజర్ కూడా
ఈ చిత్రాన్ని ఆనందీ ఇందిరా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, మహేశ్ బాబు సోదరి మంజుల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా, మంజుల కూతురు జాన్వి నటిగా తెరంగేట్రం చేస్తోంది. ఈ ప్రీ లుక్ పోస్టర్ తర్వాత రేపు ప్రీలుక్ టీజర్‌ని కూడా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.