‘పద్మావతి’ కంటే శాంతిభద్రతలే ముఖ్యమంటున్న గోవా సీఎం
- సినిమాను నిషేధించాలన్న డిమాండ్ ను పరిశీలిస్తాం
- సెన్సార్ అనుమతి వచ్చిన తర్వాతే ఓ నిర్ణయం
- అవసరమైతే వివాదాస్పద అంశాలకు కత్తెర
ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ బీజేపీ మహిళా విభాగం ప్రతినిధులు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలసి కోరడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాలేదని, అది వచ్చిన తర్వాత తాము ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే సినిమాలో వివాదాస్పద అంశాలను తొలగించడం జరుగుతుందన్నారు. ‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే చరిత్రను సరైన రీతిలో చూపించాలి. తప్పుడు మార్గంలో దాన్ని చిత్రీకరిస్తే ప్రజల మనోభావాలు గాయపడతాయి’’ అని పారికర్ పేర్కొన్నారు.