కొత్త కథతో వచ్చిన కొత్త దర్శకుడు .. ఛాన్స్ ఇచ్చేసిన బన్నీ!
- బన్నీకి కథ వినిపించిన కొత్త దర్శకుడు
- బాక్సింగ్ నేపథ్యంలో కథ
- త్వరలో పూర్తి వివరాలు
ఈ నేపథ్యంలో సంతోష్ రెడ్డి అనే యువకుడు బన్నీని కలుసుకుని ఓ కథ చెప్పాడట. ఆ కథ చాలా కొత్తగా ఉండటంతో .. తాను ఇంతవరకూ ఆ తరహా పాత్రలను చేయకపోవడంతో వెంటనే బన్నీ ఓకే చెప్పేశాడట. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని వినికిడి. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చిన బన్నీ .. వెంటనే మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ కొత్త ప్రాజెక్టును ఎప్పుడు .. ఏ బ్యానర్లో బన్నీ చేయనున్నాడనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది.