kate winslet: 'టైటానిక్' చిత్రం గురించి కొత్త విషయాలు చెప్పిన నటి కేట్ విన్స్లెట్... వీడియో చూడండి
- ఇటీవల 20 ఏళ్లు పూర్తి చేసుకున్న చిత్రం
- జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నటి
- ఓ టీవీ షోలో వెల్లడించిన కేట్
20 ఏళ్ల క్రితం 'టైటానిక్' సినిమాతో విపరీతమైన స్టార్డమ్ తెచ్చుకున్న నటి కేట్ విన్స్లెట్, ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. స్టీఫెన్ కోల్బర్ట్ లేట్ నైట్ షోలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో జాక్ పాత్రలో లియోనార్డో డికాప్రియో కాకుండా మాథ్యూ మెకానే నటించాల్సి ఉందని ఆమె అంగీకరించారు. అతనితో కలిసి ఆమె ఆడిషన్ కూడా చేసినట్లు ఒప్పుకున్నారు.
అంతేకాకుండా ఈ చిత్రంలో రోస్ బొమ్మను గీసింది స్వయంగా చిత్రదర్శకుడు జేమ్స్ కేమెరూన్ అని తెలిపారు. అలాగే థియేటర్లో ఈ సినిమా చూస్తున్నపుడు ఈ సన్నివేశం వచ్చిన సమయంలో తన కుమారుడి కళ్లు మూసినట్లు చెప్పారు. ఈ సినిమాలో 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటను తాను అస్సలు విననని అన్నారు. ఈ కార్యక్రమంలో టైటానిక్ క్లైమాక్స్ సన్నివేశాన్ని వ్యాఖ్యాత కోల్బర్ట్, కేట్లు మరోసారి నటించి ప్రేక్షకులను ఆలరించారు.