శంకర్ '2.ఓ' రిలీజ్ డేట్ మారింది.. జనవరి 26 నుంచి ఏప్రిల్ 27కు మార్పు
- '2.ఓ' వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం
- విడుదల తేదీని మార్చిన లైకా ప్రొడక్షన్స్
- 2018 ఏప్రిల్ 27న విడుదల
2018 ఏప్రిల్ 27న సినిమా విడుదల చేస్తామని వెళ్లడించింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అందులో ‘‘అత్యాధునిక హంగులతో అద్భుతమైన 3డీ చిత్రంగా ‘2.ఓ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. అందుకు సంబంధించిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. 2018 ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాం. అప్పటికి అన్నీ పూర్తవుతాయి’’ అని పేర్కొంది. కాగా, గతంలో ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేస్తామని తెలిపింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ట్రైలర్ అయినా విడుదలవుతుందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.