'నేను లోకల్' దర్శకుడితో రామ్ .. త్వరలో సెట్స్ పైకి!
- రామ్ 16వ సినిమాకి రంగం సిద్ధం
- నిర్మాతగా దిల్ రాజు
- ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
- త్వరలోనే టైటిల్ ప్రకటన
'నేను లోకల్'తో ఈ డైరెక్టర్ నానికి సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి త్రినాథరావు చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకావడం జరిగిపోయాయి. రామ్ కెరియర్లో 16వ సినిమా ఇది .. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కథానాయిక అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.