చిరూ .. రవితేజ .. నాని మాదిరిగానే సాయిధరమ్ తేజ్: బీవీఎస్ రవి
- జయాలు .. పరాజయాలు సహజం
- ప్లాప్ సినిమాలు వచ్చినంత మాత్రాన ఆ హీరోను వదులుకోరు
- సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమాతో హిట్ పడుతుంది
"చిరంజీవి గారు వున్నారు .. ఎన్నో సూపర్ హిట్స్ తరువాత ఆయనకి 'రాజా విక్రమార్క' 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్'లతో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ తరువాత 'గ్యాంగ్ లీడర్' .. 'రౌడీ అల్లుడు' .. 'ఘరానా మొగుడు' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. అలాగే రవితేజ కూడా ప్లాప్ లను ఎదుర్కుంటూ వచ్చి 'రాజా ది గ్రేట్' తో ఘన విజయాన్ని అందుకున్నాడు. నాని కూడా ప్లాప్ లను చవి చూసి .. ఆ తరువాత వరుస హిట్లు అందుకుంటున్నాడు. అలాగే సాయిధరం తేజ్ రెండు ప్లాప్ లు ఇచ్చినా .. ఈ సినిమాతో హిట్ కొడతాడనే నమ్మకం నాకు వుంది" అంటూ చెప్పుకొచ్చారు.