మేఘన్ మార్కెల్ కోసం ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని డిజైన్ చేసిన ప్రిన్స్ హ్యారీ
- ఉంగరంలో డయానా ధరించిన వజ్రాలు
- ఇంటర్వ్యూలో వెల్లడించిన మేఘన్ మార్కెల్
- పెళ్లి ప్రకటన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన జంట
మూడు డైమండ్లు పొదిగిన ఈ ఉంగరంలో రెండు వజ్రాలు ప్రిన్స్ హ్యారీ తల్లి డయానా ధరించినవి కాగా, ఇంకొకటి బోట్స్‌వానా నుంచి తీసుకువచ్చింది. వీరిద్దరూ ప్రేమలో పడిన కొత్తలో మొదటిసారి ఐదు రోజులు బోట్స్‌వానా పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరి బంధం బాగా గట్టిపడింది. ఈ ఉంగరాన్ని క్వీన్ ఎలిజబెత్ -2 అధికారిక ఆభరణాల తయారీ సంస్థ క్లీవ్ అండ్ కంపెనీ తయారుచేసింది.