పవన్ 26వ సినిమాకి మొదలైన సన్నాహాలు!
- పవన్ 25వ సినిమాగా 'అజ్ఞాతవాసి'
- ఆ తరువాత పూర్తిస్థాయి రాజకీయాలంటూ ప్రచారం
- అది నిజం కాదన్నట్టుగా రంగంలోకి దిగిన మైత్రీ మూవీస్
- త్వరలో పూర్తి స్క్రిప్ట్ విననున్న పవన్
ఇటీవలే మైత్రీ మూవీస్ వారు ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్ తెరిచారట. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ .. తన టీమ్ తో కలిసి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. 'అజ్ఞాతవాసి' సినిమా షూటింగ్ పూర్తి కాగానే, పవన్ కి ఒకసారి ఈ స్క్రిప్ట్ ను వినిపిస్తారట. బాగుంది అని ఆయన అంటే .. వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోయేలా మైత్రీ మూవీస్ వారు ప్లాన్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.