సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- రకుల్ హిందీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు
- పాటల కోసం దుబాయ్ వెళుతున్న 'జైసింహా'
- ప్రభాస్ తో కలసి చేస్తానంటున్న గోపీచంద్
- దర్శకుడిగా మారిన మరో రచయిత
* బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైసింహా' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. డిసెంబర్ 7 నుంచి 17 వరకు ఈ పాటలను దుబాయ్ లో చిత్రీకరిస్తారు. వీటిలో ఓ పాటను బాలయ్య, నయనతారలపైనా, మరో పాటను బాలయ్య, నటాషా లపైనా చిత్రీకరిస్తారు.
* తన మిత్రుడు ప్రభాస్, తాను కలసి ఓ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే మంచి కథ దొరకడం లేదని చెప్పాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఇద్దరికీ సూటయ్యే కథ కోసం వెయిట్ చేస్తున్నామని అన్నాడు. కాగా, వీరిద్దరూ కలసి గతంలో 'వర్షం' సినిమాలో నటించిన సంగతి విదితమే.
* ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారాడు. ఆయన దర్శకత్వంలో రూపొందే 'బృందావనమది అందరిది' చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నూతన నటీనటులు నటించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును వచ్చే నెల 20 నుంచి కేరళలో నిర్వహిస్తామని దర్శకుడు చెప్పాడు.