సార్... ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్: గిటార్ ప్లేయర్ తో రాంగోపాల్ వర్మ
- రాంగోపాల్ వర్మ పాదాభివందనం
- కళాకారుడి స్వర విన్యాసానికి ఫిదా
- 'టైటానిక్' గీతాలను గిటార్ పై ప్లే చేసిన ఆర్టిస్ట్
"సార్... ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్" అని వర్మ కితాబిచ్చాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న పూరీ జగన్నాథ్, ఇతనో త్యాగరాజు అని తనవంతు కితాబిచ్చాడు. సదరు కళాకారుడు ఆపై 'టైటానిక్' చిత్రంలోని గీతాన్ని ఆలపిస్తుంటే, అందరూ ఎంజాయ్ చేశారు. వర్మ టీమ్ లోని దాదాపు 15 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా, చార్మి స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.