తెలుగు తెరకి పరిచయమవుతోన్న మహేశ్ మేనకోడలు!
- దర్శకురాలిగా మహేశ్ సోదరి మంజుల
- ముఖ్యమైన పాత్రలో ఆమె కూతురు జాన్వీ
- ఆమె నటన చూశాక నమ్మకం పెరిగింది
- జాన్వీ నటన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి మహేశ్ ను గుర్తుచేసింది
అందువల్లనే ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తాను తెరకెక్కిస్తోన్న సినిమా ద్వారా జాన్వీని పరిచయం చేస్తున్నారు. ఈ విషయమై మంజుల మాట్లాడుతూ " మొదటి నుంచి కూడా జాన్వీని షూటింగ్స్ కి తీసుకురాలేదు. అందువలన ఈ సినిమా షూటింగ్ కి వచ్చిన రోజున నెర్వస్ గా ఫీలైంది. ఈ సినిమాలో జాన్వీ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. మొదటి సీన్ ను జాన్వీ పై షూట్ చేసిన తరువాత, ఆమెపై నాకు మరింత నమ్మకం పెరిగింది .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మహేశ్ గుర్తొచ్చాడు" అంటూ చెప్పుకొచ్చారు. దాంతో .. మహేశ్ మేనకోడలు భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయని చెప్పుకుంటున్నారు.