కాశీ విశ్వనాథుడి సన్నిధి నుంచి 'అజ్ఞాతవాసి' టైటిల్ ప్రకటన!
- కాశీకి బయలుదేరిన 'అజ్ఞాతవాసి' టీమ్
- టైటిల్ ప్రకటనలో కొత్త పద్ధతి
- గయా .. అలహాబాద్ లోను చిత్రీకరణ
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు
ఈ 27న టైటిల్ ను వెల్లడించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాశీ నుంచే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కాశీలోని విశ్వనాథుడి ఆలయంలో .. 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ వున్న బాక్స్ ను ఓపెన్ చేసి టైటిల్ ను ప్రకటించనున్నారట. ఇలా విశ్వనాథుడి సన్నిధి నుంచి టైటిల్ ను ప్రకటించడమనేది ఇదే మొదటిసారి అని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.