'బాలకృష్ణుడు'లో డిస్కవరీ మాధవరావుగా పృథ్వీ అదరగొట్టేశాడట!
- ఈ రోజే విడుదలైన 'బాలకృష్ణుడు'
- డిస్కవరీ మాధవరావు పాత్రలో పృథ్వీ
- ఆయన పాత్రలో కావాల్సినంత కామెడీ
- ఆడియన్స్ నుంచి దక్కుతోన్న ప్రశంసలు
పృథ్వీ కామెడీ ట్రాక్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందనీ, తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ ను పేలుస్తూ ఆడియన్స్ కి గిలిగింతలు పెట్టారని చెబుతున్నారు. పృథ్వీ పాత్ర ఎంటరైన దగ్గర నుంచి ఎండ్ టైటిల్స్ పడేవరకూ ఆయన కామెడీ కొనసాగిందనీ, ప్రేక్షకులు ఆశించే కామెడీ ఆయన పాత్ర నుంచి పుష్కలంగా లభించిందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పృథ్వీకి పడిన మంచి రోల్ ఇదేననీ .. ఈ పాత్ర ఇండస్ట్రీలో ఆయనని మరి కొన్నాళ్ల పాటు నిలబెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.