నన్ను నేను తాకట్టు పెట్టుకుని అప్పుతెచ్చి ఆ సినిమా చేయాలనిపించింది: నిర్మాత రాజ్ కందుకూరి
- తరుణ్ భాస్కర్ కథ చెప్పడానికి వచ్చాడు
- అదే సమయంలో విజయ్ దేవరకొండ వచ్చాడు
- ఇద్దరూ చెప్పాలనుకున్నది ఒకటే కథ .. అదే 'పెళ్లి చూపులు'
"తరుణ్ భాస్కర్ కథ చెప్పడం మొదలు పెట్టగానే .. విజయ్ దేవరకొండ వచ్చాడు. తరుణ్ భాస్కర్ కథ విన్నాక నీ కథ వింటాను అని విజయ్ తో చెప్పాను. ఇద్దరం చెప్పడానికి వచ్చింది ఒకే కథ సార్ .. అంటూ నవ్వేశారు. వాళ్లు చెప్పిన కథ విన్న తరువాత నన్ను నేను మరిచిపోయాను. అది ఎలాంటి స్క్రీన్ ప్లే అంటే, నా దగ్గర డబ్బు లేకపోయినా ఎదుటివాళ్ల దగ్గర నన్ను నేను తాకట్టు పెట్టుకుని అప్పుతెచ్చి చేయాల్సిన సినిమా అనిపించింది" అంటూ చెప్పుకొచ్చారు.