'హలో' సినిమాలో అఖిల్ తల్లిదండ్రులుగా జగపతిబాబు .. రమ్యకృష్ణ!
- 'హలో' నుంచి కొత్త పిక్
- అఖిల్ తల్లిదండ్రుల పాత్రల పరిచయం
- మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తోన్న అఖిల్
కథా పరంగా హీరో రాయల్ ఫ్యామిలీకి చెందినవాడనే విషయం ఈ పిక్ ను బట్టే తెలిసిపోతోంది. మొదటి సినిమాలో కంటే ఈ సినిమాలో అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమెలాగో విక్రమ్ కుమార్ కి బాగా తెలుసు. అందువలన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.